Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భారతీయ యువతి పోస్ట్ చేసిన వీడియో.. సింగపూర్ క్రమశిక్షణకు ప్రపంచం ఫిదా!

Kritika Jain shares video of  Singapore traffic rules video goes viral
Advertisement
  • సింగపూర్‌లో ఓ పాదచారి క్రమశిక్షణకు సంబంధించిన వీడియో వైరల్
  • అర్ధరాత్రి ఒంటి గంటకు ఖాళీ రోడ్డుపై గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురుచూపు
  • భారతీయ యువతి కృతిక జైన్ పోస్ట్ చేసిన వీడియోకు 4.4 కోట్ల వ్యూస్
  • సింగపూర్ పౌరుల క్రమశిక్షణపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వెల్లువ
Advertisement
సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటి గంట సమయం.. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి.. ఒక్క వాహనం కూడా కనిపించడం లేదు. అయినా ఒక పాదచారి మాత్రం ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగి, పాదచారులకు గ్రీన్ లైట్ వెలిగే వరకు ఓపికగా ఎదురుచూశారు. ఈ చిన్న సంఘటనను ఓ భారతీయ యువతి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ వీడియోకు ఏకంగా 44 మిలియన్లకు (4.4 కోట్లకు) పైగా వ్యూస్ రావడం విశేషం.

కృతిక జైన్ అనే భారతీయ యువతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా '@theroamingtoes'లో మే 31న ఈ వీడియోను పంచుకున్నారు. "ఇది అలవాటో, క్రమశిక్షణో, లేక వారి నైజమో నాకు తెలియదు" అని క్యాప్షన్ జోడించారు. వీడియోపై "సింగపూర్‌లో అర్ధరాత్రి ఒంటి గంటకు ఒక వ్యక్తి పాదచారుల సిగ్నల్ కోసం ఎదురుచూడటం చూస్తుంటే.. చిన్న చిన్న అలవాట్లే ఒక దేశాన్ని ఎలా తీర్చిదిద్దుతాయో అర్థమవుతుంది" అంటూ రాసుకొచ్చారు.

ఈ వీడియో చూసిన నెటిజన్లు సింగపూర్ పౌరుల క్రమశిక్షణను, నియమాలను పాటించే తత్వాన్ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఎవరూ చూడకపోయినా, శిక్షించేవారు లేకపోయినా నిబంధనలను గౌరవించడం గొప్ప విషయమని కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లోని పరిస్థితులతో పోలుస్తూ, ఈ క్రమశిక్షణ ఎంతో స్ఫూర్తిదాయకమని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొందరు దీనిని పౌర స్పృహకు నిదర్శనంగా భావిస్తుంటే, మరికొందరు అక్కడి కఠినమైన చట్టాల వల్లే ప్రజలు అలా ప్రవర్తిస్తారని విశ్లేషిస్తున్నారు.

గతంలో కూడా కృతిక జైన్ సింగపూర్ భద్రత, జీవనశైలి గురించి పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అయ్యాయి. అర్ధరాత్రి 3 గంటలకు ఒంటరిగా సురక్షితంగా నడుస్తున్న వీడియోను ఆమె గతంలో షేర్ చేశారు. తాజా వీడియోతో సింగపూర్ క్రమశిక్షణ, పౌర బాధ్యతపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. ఒక సమాజం ఉన్నతంగా ఎదగడంలో వ్యక్తిగత క్రమశిక్షణ ఎంత కీలక పాత్ర పోషిస్తుందో ఈ చిన్న సంఘటన గుర్తుచేస్తోందని పలువురు పేర్కొంటున్నారు.
Advertisement
Advertisement
Kritika Jain
Singapore
Traffic
Viral Video

More Telugu News